అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని హరిపురం గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారి పై ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ని ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెంగళూరు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా... ప్రమాదవశాత్తు మార్గమధ్యలో ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కర్నూలు జిల్లా నగురూరుకి చెందిన వంశీ అనే యువకుడి తలకు గాయాలయ్యాయి. మరో యువకుడు వెంకటేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికుల సహాయంతో క్షతగాత్రున్ని 108 అత్యవసర వాహనంలో పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ఇవీ చదవండి...పారిశుద్ధ్య నిర్వహణపై కొట్లాట.. మహిళ మృతి