అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎంఎస్పీ కొట్టాల వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ, అతని భార్య కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న కుమారుడిని చూసేందుకు వెళ్తున్నారు. కొట్టాల వద్దకు రాగానే రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని కారు బోల్తాపడింది. ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని కదిరి ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద లభించిన నగదు, బంగారు ఆభరణాలను అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..