అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు గ్రామ సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పద్మావతి (42) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త కొండప్పకు తీవ్రగాయాలయ్యాయి.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... హిందూపురం మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దంపతులు కొండప్ప , పద్మావతిలు ద్విచక్ర వాహనంపై ధర్మవరంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. గుట్టూరు వద్ద వారు ప్రమాదానికి గురయ్యారు. పద్మావతి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన కొండప్పను పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం బెంగళూరుకు తరలించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి