అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల వీరేపల్లి గ్రామం వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొంది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందాడు. యాడికి మండలం రాయలచెరువుకి చెందిన ఆదినారాయణ(17) అనే బాలుడు గుత్తి నుండి రాయలచెరువు వైపు వెళుతుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు ఆటోని ఢీకొంది. ఆదినారాయణ ఆటోని అదుపు చేయలేక ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆదినారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఇదీ చూడండి. కారు డోర్ లాక్.. ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతి