రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దంకి మండలం.. ఆర్. కట్టాల గ్రామంలో ఈ ఘటన జరిగింది.
మృతుడిని పెద్దకోడిపల్లి గ్రామానికి చెందిన వీరేష్ (25)గా గుర్తించారు. క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: