అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం ఎల్బీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్లారి ఆర్ అండ్ బి ప్రధాన రహదారిలో పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ను వెనుక వైపు నుంచి వేగంగా వచ్చిన సిమెంట్ లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. వారంతా వ్యవసాయ కూలీలు...వరి గడ్డి కోసం కనేకల్ మండలం మారంపల్లి నుంచి బొమ్మనహాళ్ మండలం బండారు గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కనేకల్లుకు చెందిన చిక్కన్న(50) మృతి చెందగా...బోయ వెంకటేశులు, తిప్పేస్వామి, గుడి వెంకటేశులు అనే వ్యవసాయ కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని కర్ణాటకలోని బళ్లారి విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చూడండి: లోక్సభలో చర్చకు తలాక్ బిల్లు- నేడు ఆమోదం!