ETV Bharat / state

ప్రజల ప్రాణాలతో ఆర్​ఎంపీలు చెలగాటం - అనంతపురం జిల్లా రాయదుర్గంలో కరోనా వార్తలు

కరోనా వ్యాప్తితో ఒకవైపు.. లాక్​డౌన్​తో మరోవైపు ప్రజలు నానా తంటాలు పడుతుంటే ఇదే అదునుగా కొంతమంది ఆర్​ఎంపీ వైద్యులు డబ్బులకు కక్కుర్తి పడుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇది గుర్తించిన అధికారులు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఆర్ఎంపీ వైద్యుడికి చెందిన క్లినిక్​ను సీజ్​ చేశారు.

RMP doctors play games with the people
ప్రజల ప్రాణాలతో 'ఆర్​ఎంపీ'లు చెలగాటం
author img

By

Published : Apr 21, 2020, 1:27 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాల మేరకు చెన్నవీర అనే ఆర్ఎంపీ వైద్యుడికి చెందిన క్లినిక్​ను ప్రభుత్వ వైద్యాధికారి రమేష్ సీజ్ చేశారు. వైరస్ అదుపు చేయడానికి ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతుంటే ఆర్ఎంపీ వైద్యులు మాత్రం అరకొర వైద్యం చేస్తూ సామాన్య ప్రజల దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఆర్​ఎంపీ వైద్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి..

'చాలా నిజాయతీగా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఆర్డర్‌ చేశాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.