అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో కరోనా కలకలంతో అక్కడున్న సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ అధికారిణికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధరణ కావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించిన కరోనా బాధితుల జాబితాలో పట్టణానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారు. దీంతో పాటు రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారిణికి కరోనా నిర్ధరణ అయినట్లు వెల్లడించారు. ఆమె ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: చివరి గంటలో రిలయన్స్ దూకుడు- సెన్సెక్స్ 458+