Retired ASP Balanarsimha Reddy: అనంతపురంలో మాజీ ఏఎస్పీ బాలనర్సింహారెడ్డి భవనాన్ని అధికారులు కూల్చివేశారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కక్షతోనే తన భవనాన్ని కూల్చివేశారని బాలనర్సింహారెడ్డి ఆరోపిస్తున్నారు. రహదారి విస్తరణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. దానిలో స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి హస్తముందని సీఎం జగన్‌కు లేఖ రాసినందుకే ఇలా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డు విస్తరణలో భాగంగా బాలనర్సింహారెడ్డి భవనాన్ని గతంలో కొంతమేర కూల్చివేయగా.. రహదారిని ఇష్టానుసారం మార్చేశారని దీనిలో స్థానిక ఎమ్మెల్యే హస్తముందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్‌కు లేఖ రాశారు. సోమవారం పోలీసు పహారా మధ్య భారీ యంత్రాలతో ఆయన భవనాన్ని అధికారులు మరికొంత కూల్చివేశారు. ఎమ్మెల్యే కక్షగట్టి తన భవనం కూల్చివేశారని బాలనర్సింహారెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: