అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఓ రెవెన్యూ అధికారి చిరు వ్యాపారులను బెదిరించి కందిపప్పును తీసుకెళ్లాడన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగభూషణంతో పాటు...ఆల్ మర్చంట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో ఆర్డీవో సమావేశమయ్యారు. విచారణ అనంతరం జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించనున్నట్లు ఆర్డీవో రామ్మోహన్ తెలిపారు.
ఏం జరిగిందంటే..
ఈనెల 17వ తేదీన బళ్లారి నుంచి రాయదుర్గం వైపు కిరాణా సరుకులతో వెళ్తున్న ఆటోను రెవెన్యూ అధికారి ఆపి.. డ్రైవర్పై దౌర్జన్యం చేసి కందిపప్పు, తదితర నిత్యావసరలను తన వాహనంలో అనంతపురం తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా రాయదుర్గం వ్యాపారితో తహసీల్దార్ చేసిన సంభాషణను వ్యాపారులు రికార్డ్ చేశారు. అది వైరల్ కావటంతో.. ప్రసార మాధ్యమాలు, పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు, ప్రజాసంఘాల నేతలు తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి-కందిపప్పు కోసం రెవెన్యూ అధికారి కక్కుర్తి