అనంతపురం జిల్లా నీలంపల్లిలో జాతీయ ఉచిత పశు కృత్రిమ గర్భదారణ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ తలారీ రంగయ్య, మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి హాజరయ్యారు. పథకం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో పాడి రైతులు సంతోషంగా ఉండాలని... ఇన్సూరెన్స్ చేయించుకున్న గేదె చనిపోతే 35వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లు నేతలు తెలిపారు. గోకుల్ మిషన్ ద్వారా ప్రతి గేదెకు గర్భాదారణ సూదులను ఉచితంగా వేయించనున్నట్లు స్పష్టం చేశారు. ప్యాకెట్ పాలు అనారోగ్యానికి దారి తీస్తాయని.. ఉత్పాదకత పెంచి స్వచ్ఛమైన ఆవు, గేదె పాలు తాగాలని ప్రజలకు సూచించారు.
ఇవీ చూడండి- ప్రమాదానికి కారణమైన అందరిపైనా చర్యలు: డీజీపీ