అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఓ చిత్రకారుడు రామాయణం, రాముడి పట్ల తన భక్తిని చాటుకుంటూ.. రావి ఆకులపై రామాయణములోని ఘట్టాలను చిత్రీకరించారు. కదిరి పట్టణానికి చెందిన శేషాద్రి.. శ్రీరామచంద్రమూర్తి , సీతమ్మ, ఆంజనేయుడితో పాటు రామాయణంలోని ఘట్టాలను కళ్లకు కట్టినట్టు ఆకులపై తీర్చిదిద్దారు. రావి ఆకులపై రామాయణం ఘట్టాలను తిలకించిన భక్తులు చిత్రకారుడిని అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈ రామ భక్తులు.. రామదాసుకేం తీసిపోరు!