అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజాసంఘాల నాయకులు.... గ్రామ సచివాలయం ఎదుట నిరసన చేశాయి. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయ సిబ్బందికి అందజేశారు.
ప్రతీ కుటుంబానికి 3 నెలలు పాటు నెలకు రూ. 7500 ఇవ్వాలని కోరారు. జాబ్ కార్డులు లేని వారందరికీ కార్డులు ఇచ్చి.. కుటుంబానికి 200 పని దినాలు, రూ. 600 వేతనం ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో ప్రమాదవశాత్తూ చనిపోయిన వారికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని సీపీఎం మండల కార్యదర్శి రామాంజనేయులు కోరారు.
ఇదీ చదవండి: