రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసే సభ్యులను... సభలో లేకుండా చేయాలనే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని... తెదేపా అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి విమర్శించారు. అచ్చెన్నాయుడిని అరెస్టును వ్యతిరేకిస్తూ... అనంతపురం సంఘమేశ్వర కూడలిలోని జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఇప్పటికే ఉన్నత న్యాయస్థానాలు 64 కేసుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పినప్పటికీ... ముఖ్యమంత్రి తీరులో మార్పు రావటంలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: లైవ్ అప్డేట్స్: ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు: రామ్మోహన్‌నాయుడు