అనంతపురం జిల్లా సోమందేపల్లిలోని కెనరా బ్యాంకు వద్ద పంట రుణాల నవీకరణ కోసం రైతులు పడిగాపులు కాశారు. తమ వంతు కోసం వరుసలో నిలబడలేక రోడ్డుపైనే కూర్చుండిపోతున్నారు. సోమందేపల్లి కెనరా బ్యాంకులో మొత్తం 2,500 మంది రైతుల పంట రుణాల ఖాతాలు ఉన్నాయి. ఇప్పటివరకు 300 మంది రైతులకు సంబంధించి రుణాల నవీకరణ పూర్తి అయ్యింది.
అధికారుల లెక్కల ప్రకారం ఇంకా 2,200 మంది రైతులు రుణాలు నవీకరణ చేసుకోవాల్సి ఉంది. అయితే మే 31 వరకే రుణాల నవీకరణకు ఆఖరు తేదీ అయిన కారణంగా.. వందల సంఖ్యలో రైతులు బ్యాంకు వద్ద బారులుతీరుతున్నారు. కానీ.. అధికారులు మాత్రం రోజుకు 50 నుంచి 60 మంది రైతుల పంట రుణాలు మాత్రమే నవీకరిస్తున్నారు. ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: