అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరుతోపు వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
35 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: కార్తికస్నానంలో విషాదం.. గల్లంతైన ముగ్గురు యువకులు