అనంతపురం జిల్లాలో ఓ గర్భిణి అత్యవసర పరిస్థితుల దృష్ట్యా.. బస్టాండ్లోనే ప్రసవించింది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని ఎర్రయ్యపల్లి గ్రామం నుంచి నిండు గర్భిణీని ఆటోలో బంధువులు ఆస్పత్రికి తీసుకువస్తుండగా ఆమెకు నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్బిణిని.. దిక్కుతోచని స్థితిలో రాప్తాడు బస్టాండ్లో ఉంచారు. విషయం తెలుసుకున్న రాప్తాడు ఏఎస్ఐ నాగభూషణం అక్కడికి చేరుకుని ఆర్ఎంపీ డాక్టర్, ఆయా లక్ష్మీదేవి సహకారంతో వైద్యం అందేలా చేశారు.
అనంతరం ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉండటంతో వారిని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కరోనా విజృంభిస్తున్న వేళ.. మనిషి మనిషిని తాకడానికి భయపడుతున్న తరుణంలో ఏఎస్ఐ తన బాధ్యతను నిర్వహించి రెండు ప్రాణాలను కాపాడారని గర్భిణీ కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి: