అనంతపురం కల్యాణదుర్గం ప్రధాన రహదారిలో దానిమ్మ కాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. కాయలన్నీ రోడ్డు మీద పడి పాడైపోవటంతో సుమారు లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు లారీ డ్రైవర్ చెప్పాడు. బెలుగుప్ప మండలం గుండ్లపల్లి నుంచి 4 టన్నుల దానిమ్మ కాయలు తమిళనాడు ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇందులో అధిక శాతం కాయలు పగిలిపోగా మరికొన్ని మార్కెట్ చేసుకోవడానికి వీలులేకుండా అయ్యాయి. అయితే కాయలు కొనుగోలు చేసి తమిళనాడు తరలిస్తున్న వ్యాపారి వివరాలు వెల్లడించేందుకు లారీ సిబ్బంది నిరాకరించారు.
ఇవీ చదవండి... తితిదే ఆస్తులు వేలం వేయటానికి వీల్లేదు: టీజీ వెంకటేశ్