ETV Bharat / state

జనసేన అభ్యర్థి నివాసంలో పోలీసులు తనిఖీలు - police

జనసేన అభ్యర్థి మధు సూధన్ గుప్తా నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 9 లక్షల విలువ చేసే 39 కుట్టు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

గుప్తా నివాసంలో పోలీసుల సోదాలు
author img

By

Published : Mar 31, 2019, 5:36 AM IST

Updated : Mar 31, 2019, 5:52 AM IST

గుప్తా నివాసంలో పోలీసుల సోదాలు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా నివాసంలో పోలీసులు... పురపాలక అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. ఓటర్లకు పంచేందుకు కుట్టు యంత్రాలను సిద్ధంగా ఉంచారన్న సమాచారంతో సీఐ ప్రభాకర్... రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు గుప్తా నివాసంలో సోదాలు చేపట్టారు. ఆయన గృహంలో 9 లక్షలు విలువ చేసే 39 కుట్టు యంత్రాలను గుర్తించి సీజ్ చేశారు. వీటిపై లోతుగా దర్యాప్తు జరిపి వివరాలు మీడియాకు తెలియజేస్తామని సీఐ తెలిపారు. వీటిని ఓటర్లను ప్రభావితం చేయడానికి కాదని... పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు గతంలోనే కొన్నామని గుప్తా సోదరుడు అన్నారు. గుత్తి పట్టణంలోని పేద కార్మికులకు జీవనోపాధి కల్పించడానికితమ సోదరుడు నిల్వ ఉంచారని అన్నారు. అన్ని రసీదులు తమ దగ్గర ఉన్నాయని చట్టబద్ధంగా తమ వస్తువులు తిరిగి స్వాధీన పరుచుకుంటామని స్పష్టం చేశారు.

This is test file from feedroom
Last Updated : Mar 31, 2019, 5:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.