ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - అనంతపురం కదిరి తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో నాటుసారా స్థావారాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. గుట్టుచప్పుడు కాకుండా తయారు చేస్తున్న నాటుసారా స్థావరాలను పోలీలుసు భగ్నం చేశారు. పలుచోట్ల సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు.

natusara productions in ananthapur
నాటుసారా స్థావరాలు భగ్నం
author img

By

Published : Mar 28, 2021, 9:31 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. మండలంలోని పలు గ్రామాల్లో కార్డెన్ సెర్చ్​లో భాగంగా రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం నుంచే నాటుసారా స్థావరాలపై సోదాలు నిర్వహించారు.

నాటు సారా తయారు చేస్తున్నారని తమకు అందిన పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామని స్థానిక రూరల్ సీఐ ఎండీ రియాజ్ అహ్మద్ తెలిపారు. నాటుసారా తయారీ చేసే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి బిందెలలో నిల్వ ఉంచిన రెండు వేల లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులను పోలీసులు హెచ్చరించారు.

కదిరి, నల్లచెరువు మండలాల్లో దాడులు..

అనంతపురం జిల్లా కదిరి, నల్లచెరువు మండలాల్లోని పలు గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కదిరి మండలం మరవ తండా సమీపంలోని అటవీ ప్రాంతంలోని నాటుసారా తయారీ కేంద్రంపై సీఐ నిరంజన్ రెడ్డి, సిబ్బంది దాడులు చేశారు. నాటుసారా తయారీ కోసం ఉంచిన 2 వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 30 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. నల్లచెరువు మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు చేసిన పోలీసులు ఊటని గుర్తించి కాల్చివేశారు. తయారీదారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

హోలీ ప్రత్యేకం.. ఇక్కడ మగాళ్లు.. మగువల్లా సింగారించుకుంటారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.