అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల తండా వద్ద పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 55 వేలు, 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
పేకాటపై పక్కా సమాచారంతో పోలీసులు సాధారణ వ్యక్తుల్లాగా అక్కడికి వెళ్లారు. వారి రాకను గమనించి నిందితులు పారిపోయే ప్రయత్నం చేయగా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: