అనంతపురం నగరంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని 5వ రోడ్డులో జూదం ఆడుతున్నారని సమాచారం అందినమేరకు.. సెబ్ పోలీసులు, మూడో పట్టణ పోలీసులు దాడులు జరిపారు.
25 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 4 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతున్నామన్నారు.
ఇదీ చదవండి: