ETV Bharat / state

హిందూపురంలో పోలీస్​ అమరవీరుల స్మారక దినోత్సవాలు - police organized blood donate camp

అనంతపురం జిల్లాలో పోలీస్​ అమరవీరుల స్మారక దినోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా హిందూపురంలో పోలీసులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

blood donation camp
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
author img

By

Published : Oct 27, 2020, 10:43 AM IST

అనంతపురం జిల్లాలో పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం ఒకటవ పట్టణ పోలీస్​స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీస్​ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు పాల్గొని రక్తదానం చేశారు.

పోలీస్​ అమరులకు నివాళులర్పించిన డీఎస్పీ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తామన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం మంచి విషయమని చెప్పారు. ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రక్తదాతలకు సీఐ పండ్లు, ప్రశంసాపత్రాలను అందించారు.

ఇదీ చదవండి: నెల్లూరులో పోలీస్​ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.