నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగా.. అనంతపురంలో రైలు రోకో నిర్వహించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నల్ల చట్టాలతో పోల్చిన రైతులు.. వాటిని రద్దు చేయాలని, లిఖింపూర్లో రైతులను కారుతో ఢీకొట్టిన ఘటనకు బాధ్యున్ని చేస్తూ.. కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
రైలు రోకో నేపథ్యంలో రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. ఆందోళన కారులను అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. ఈ ప్రభుత్వాలకు కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా.. కేంద్రం కొత్త చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: