ETV Bharat / state

వ్యసనాలకు బానిసై దొంగతనాలు...ఐదుగురు అరెస్టు - తాజాగా అనంతపురంలో దొంగతనం కేసులు

చెడు వ్యసనాలకు బానిసై, అక్రమ మార్గంలో సొమ్ము సంపాదించాలని దొంగతనాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆరు తులాల బంగారు నగలు, 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

five robbers arrested
వ్యసనాలకు బానిసై దొంగతనాలు
author img

By

Published : Dec 1, 2020, 1:47 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 తులాల బంగారు నగలు 7 ద్విచక్ర వాహనాలు ఏడు వేల నగదును స్వాధీన పరుచుకున్నారు. నిందితులు ధర్మవరానికి చెందిన చేనేత కార్మికులు శ్రీనాథ్, గోపి, వెంకటేష్, నవీన్, మురళిగా గుర్తంచారు.

వీరంతా జల్సాలకు అలవాటు పడి అక్రమ మార్గంలో సొమ్ము సంపాదించటం కోసం దొంగతనాలు చేయటం ఆరంభించారు. ఇప్పటివరకు ధర్మవరం, కదిరిలో ఇద్దరు మహిళల మెడల్లో బంగారు నగలు లాక్కెళ్లారు . అలాగే మదనపల్లి సోమందేపల్లి ముదిగుబ్బ ప్రాంతాల్లో 7 ద్విచక్ర వాహనాలు ఎత్తుకెళ్లారు. ఐదుగురు నిందితులను కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్​కు తరలించాలని ఆదేశించినట్లు సీఐ కరుణాకర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...సర్కారు జలం.. రోగాలు ఉచితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.