ETV Bharat / state

సీజ్​ చేసిన మద్యంతో పోలీసుల విందు.. వీడియో వైరల్​..! - ananthapuram district latest news

బాధ్యతగా మెలగాల్సిన పోలీసులే దారి తప్పారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంతో ఏకంగా పోలీస్​ స్టేషన్​లోనే విందు చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. పోలీసులు మద్యం తాగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అనంతపురం జిల్లా హిందూపురంలో జరిగిన ఘటన వివరాలివి..!

police-drinking-liquor-in-police-station-at-hindhupuram-ananthapuram-district
సీజ్ చేసిన మద్యంతో...పోలీసుల విందు
author img

By

Published : Jul 6, 2020, 1:11 PM IST

Updated : Jul 6, 2020, 2:49 PM IST

సీజ్ చేసిన మద్యంతో...పోలీస్​స్టేషన్​లో పోలీసుల విందు

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యంతో పోలీసులు ఏకంగా పోలీసు స్టేషన్​లోనే విందు చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది. కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని హిందూపురం రెండో పట్టణ పోలీసులు 15 రోజుల క్రితం స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం పోలీసు స్టేషన్​లోనే ఉంచగా.. దాని నుంచి కొన్ని మద్యం సీసాలు తీసుకొని ఓ గదిలో విందు చేసుకున్నారు. పోలీసులు మద్యం సేవిస్తోన్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఘటనపై స్పందించిన అధికారులు...

మాట్లాడుతున్న డీఎస్పీ
ఈ ఘటనపై అధికారులు స్పందించారు. కానిస్టేబుళ్లను వీఆర్​కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఆ కానిస్టేబుళ్లు సేవించిన మద్యం.. ఇటీవల పట్టుబడిన కర్ణాటక మద్యం కాదని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు. ముగ్గురు కానిస్టేబుళ్లను వీఆర్​కు పంపుతూ ఆదేశాలు జారీ చేశామన్నారు. సమగ్ర విచారణ చేపట్టిన అనంతరం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చదవండి:

కర్ణాటక మద్యం పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

Last Updated : Jul 6, 2020, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.