మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలను ఉపేక్షించబోమని నాలుగో పట్టణ సీఐ శ్రీనివాసులు చెప్పారు. అనంతపురంలో జనశక్తి నగర్ హైపర్ సెన్సిటివ్, ఆజాద్ నగర్, కళ్యాణదుర్గం రోడ్డు ప్రాంతాల్లో ఓటర్లకు.. పోలీసులు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఎక్కడైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి మద్యం, డబ్బు పంపిణీ చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి: దేవాలయ పరిసరాల్లో క్వారీ పనులు ఆపాలని నిరసన