అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ కార్యాలయంలో దొంగల బీభత్సంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం శిక్షణ ఐపీఎస్ ఆదిరాజ్ సిన్హా ఘటనా స్థలిని పరిశీలించారు.
ఆగస్టు 31న పట్టణంలోని మణప్పురం గోల్డ్ ఫైనాన్స్‌లో సిబ్బందిని దొంగలు తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. ఈ క్రమంలో శిక్షణ ఐపీఎస్ ఆది రాజ్ సిన్హా రాణా, కళ్యాణదుర్గం డివిజన్ డీఎస్పీ వెంకటరమణలు దోపిడి జరిగిన తీరుపై సిబ్బందిని ఆరా తీశారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. సంస్థ ఎదురుగా ఉన్న దుకాణాల యజమానులతో మాట్లాడారు. కేసును త్వరితగతిన చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: