అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం రాళ్లఅనంతపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సోదరులు గాయపడ్డారు. ధర్మవరం మండలం పోతుల నాగేపల్లికి చెందిన అన్నదమ్ములు గొర్రెలు కొనేందుకు కదిరికి వెళ్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పింది. స్థానికులు 108కు సమాచారం అందించటంతో, వారు వచ్చి బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
క్షతగాత్రుల దగ్గర ఉన్న రూ.49,300 నగదు, రెండు చరవాణులను 108 వాహన సిబ్బంది భద్రపరచి, బాధితుల కుటుంబసభ్యులకు అందజేశారు. అంబులెన్స్ సిబ్బంది మంచితనం చూసి వారు ఆనందం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని ప్రశంసించారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, ఇద్దరికి గాయాలు