ETV Bharat / state

ప్లాస్మా బ్యాంకు.. పరిశోధనలకు ఊతం!

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి శాస్త్రవేత్తలు ప్లాస్మాపై పరిశోధనలు చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి ప్లాస్మా సేకరించి... కొవిడ్ బాధితులకు ఎక్కించి ప్రాణాపాయాన్ని తప్పించే వైద్యంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ తరుణంలో వ్యాధి నయమైన రోగుల ప్లాస్మా పెద్దఎత్తున అవసరం ఉంటుంది. రోగుల బ్లడ్ గ్రూప్, ప్లాస్మా దానంపై అంగీకార పత్రం తీసుకుని ఓ డాటా బ్యాంక్ ను ఏర్పాటుచేస్తే ఉపయోగకరంగా ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

ప్లాస్మా  బ్యాంకు.. పరిశోధనలకు ఊతం.!
ప్లాస్మా బ్యాంకు.. పరిశోధనలకు ఊతం.!
author img

By

Published : Jul 15, 2020, 2:31 PM IST

దేశంలో రక్తదానం, నేత్ర దానంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన వచ్చింది. దేశ వ్యాప్తంగా కోట్ల మంది క్రమం తప్పకుండా రక్తదానం చేస్తున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. మరణానంతరం నేత్రదానం చేసేందుకు ఎంతో మంది స్వచ్ఛందంగా ఆసుపత్రులకు ఆమోద పత్రాలు ఇస్తుంటారు. సాటి మనిషి ప్రాణం కాపాడేందుకు రక్తదానం చేస్తుంటారు. నేత్రదానంతో అభాగ్యులకు కంటి వెలుగునిస్తుంటారు. వీటిలానే ప్లాస్మాదానం కూడా ఎంతో ముఖ్యమైంది నేడు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది ఒక్కటే... కరోనా వైరస్ వ్యాక్సిన్. అనేక దశల ప్రయోగాల అనంతరం గానీ వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదంటున్నారు నిపుణులు. ఈ సమయంలో ప్లాస్మా చికిత్స.. బాధితులకు ఓ మార్గాన్ని చూపిస్తుంది. కరోనా నుంచి కోలుకున్న రోగి రక్తంలోని ప్లాస్మాతో కొత్తగా కరోనా వైరస్ సోకిన రోగికి వైద్యం చేసే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.

అమెరికాలో మొదటిగా...

అమెరికాలో ప్లాస్మా చికిత్స 1917వ సంవత్సరంలోనే విజయవంతంగా నిర్వహించారు. 1918లో వైద్య జర్నల్ లో ఈ చికిత్స గురించి ప్రకటించారు. పలు దేశాల్లో వివిధ సందర్భాల్లో ప్లాస్మా చికిత్స అరుదుగా నిర్వహిస్తున్నారు. అయితే మొండి వైరస్ గా మారిన కొవిడ్ కు... ఆ వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తి ప్లాస్మాతో వైద్యం చేయవచ్చని నిపుణులు ఈ చికిత్సను తెరమీదకు తెచ్చారు.

ప్లాస్మా డేటా బ్యాంకు కీలకం

ఈ నేపథ్యంలో వైరస్ సోకిన రోగులకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకోవటంతోపాటు, ప్లాస్మా ఇవ్వటానికి ఆమోద పత్రం తీసుకుంటే భవిష్యత్ లో ఎన్నో ప్రాణాలను నిలబెట్టవచ్చేనే ఆలోచన చేస్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఈ సమాచారంతో ఓ డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తే ప్లాస్మా వైద్యం ఒక్క కరోనాకే కాకుండా అనేక వైరస్ లకు సంబంధించిన వ్యాధులు నయం చేయటానికి కీలకంగా మారుతుందంటున్నారు.

రాష్ట్రంలో ప్లాస్మా పరిశోధనలు ఎప్పుడో..!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 31 వేలకు పైగా కరోనా కేసులు వచ్చాయి. వీరిలో 365 మంది మరణించారు. వైరస్ నుంచి 16,464 మంది కోలుకున్నారు. వ్యాధి నయమైన వారి రక్త గ్రూపు సమాచారం సేకరించి, ప్లాస్మా దాతలుగా ఆమోదపత్రం తీసుకుని సమాచారాన్ని భద్రపరిస్తే మున్ముందు చాలా ప్రయోజనం ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ తరహా సమాచారంతో రాష్ట్ర స్థాయిలో డాటా బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్లాస్మా సేకరించి కొవిడ్ రోగులకు వైద్యం అందించటానికి దేశంలో 46 చోట్ల పరిశోధనలకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది. మరో 64 సంస్థలు ప్లాస్మా చికిత్సపై పరిశోధన చేస్తామంటూ అనుమతి కోరాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రెండు చోట్ల ప్లాస్మా సేకరణ పరిశోధన మొదలు కాగా, ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటి వరకు అనుమతి రాలేదు. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టిపెట్టి ఉంటే 50 ఏళ్ల అనుభవం ఉన్న వైద్యకళాశాలకు అనుమతి వచ్చేదని వైద్యులు అంటున్నారు.

రక్తానికి సంబంధించిన వ్యాధులు ఏటా ప్రజలకు ప్రాణాంతకంగా మారుతున్నప్పటికీ రాష్ట్రంలో బోధనాసుపత్రుల్లో హెమటాలజిస్టు నియామకాలు అంతంతమాత్రమే. ప్రస్తుత విపత్కర తరుణంలో.. హెమటాలజిస్టులు అందుబాటులో ఉంటే ప్లాస్మా సేకరణ, రోగుల డేటా బ్యాంకు అవసరాలను గుర్తించే పరిస్థితి ఉండేదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:

తన తండ్రి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్నే జగన్ ఆపేస్తారా?..: సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.