ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట పురుగులమందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం - కూడేరులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం వార్తలు

సీజ్ చేసిన తన బైక్ ఇవ్వాలంటూ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన.. అనంతపురం జిల్లా కూడేరులో జరిగింది. అతన్ని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించి.. జరిగిన ఘటనపై కేసు నమోదు చేశారు.

person suicide attempt infront of police station in kuderu ananthapuram dsitrict
కూడేరు పోలీస్ స్టేషన్
author img

By

Published : Jun 29, 2020, 2:17 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎస్సై యువరాజు తెలిపిన వివరాల ప్రకారం.. జయరామ్ అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తూ కొన్ని రోజుల కిందట పోలీసులకు చిక్కాడు. అతనిపై కేసు నమోదు చేసి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం రాత్రి అతను స్టేషన్​కు వచ్చి తన బైక్ ఇవ్వాలని కానిస్టేబుల్​ను బెదిరించాడు. కుదరదు అని చెప్పటంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి...

అత్యాచారం జరిగిందని చెప్పిన భార్య... తేలిగ్గా తీసుకున్న భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.