ETV Bharat / state

ఎస్పీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తన స్థలాన్ని సీఐ దౌర్జన్యంగా రాయించుకున్నారని ఆరోపిస్తూ.. అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. తన భూమిని అక్రమంగా రాయించుకోవడమే కాక తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయాడు. దీనిపై ఎస్పీని కలిసేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారంటూ బలవన్మరణ ప్రయత్నం చేశాడు.

person suicide attempt in ananthapuram sp office
ఎస్పీ కార్యాలయం వద్ద పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Jul 9, 2020, 3:33 PM IST

Updated : Jul 9, 2020, 4:29 PM IST

అనంతపురం ఎస్పీ కార్యాలయం వద్ద ఓ వ్యక్తి పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. రమేశ్ అనే వ్యక్తికి బుక్కరాయసముద్రంలో సర్వే నెంబర్ 34-2, 34-3లో 20 సెంట్ల స్థలం ఉంది. దాన్ని సీఐ సాయిప్రసాద్ తమను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అతను ఆరోపిస్తున్నాడు. గతంలోనూ దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపాడు.

నేడు ఎస్పీని కలిసేందుకు వచ్చిన తనను పోలీసులు అడ్డుకున్నారని రమేశ్ తెలిపాడు. దీంతో అతను పెట్రోల్ పోసుకుని బలవన్మరణ ప్రయత్నం చేశాడు. ఎస్పీ ఆఫీసులోనే తనకు న్యాయం జరగకపోతే ఇంకెక్కడ జరుగుతుందంటూ బాధితుడు వాపోయాడు. సీఐ తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని.. తన స్థలాన్ని అక్రమంగా రాయించుకుని తనపైనే కేసులు పెడతానంటూ బెదిరిస్తున్నారని ఆరోపించాడు.

ఇవీ చదవండి..

'వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తూ.. రైతు దినోత్సవ ఉత్సవాలా..?'

Last Updated : Jul 9, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.