అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని లక్ష్మంపల్లి గ్రామానికి చెందిన యువకుడు కొల్లప్ప.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో తాపీ పని చేశాడు. తనకు రావాల్సిన ఒకటిన్నర లక్ష రూపాయలను సంబంధిత వ్యక్తుల నుంచి ఇప్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అయితే ఎస్సై సానుకూలంగా స్పందిస్తున్నా హెడ్ కానిస్టేబుల్ మాత్రం తరచూ తనను వేధిస్తున్నాడని, మోటార్ సైకిల్ కూడా పని చేసిన చోటే ఉండి పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపాడు. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 5లక్షలకు చేరువలో కరోనా కేసులు