అనంతపురం జిల్లా కదిరిలో పట్టపగలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుని జీవనం సాగించే మహబూబ్ బాషా పట్టణములోని హిందూపురం రోడ్డులో మృతి చెందారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దుకాణ సముదాయాల పక్కన ఉండే ఖాళీ ప్రదేశంలో తలకు బలమైన గాయాలై కనిపించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా... సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పరిశీలించారు. తలపై బండరాయితో మోదడం వల్ల... బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోందని అన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: కూల్‌డ్రింక్‌లో చీమల మందు.. బాలుడు మృతి, పాప పరిస్థితి విషమం