అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చెన్నప్పగా గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న విద్యుత్ మరమ్మతులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఎప్పటిలానే ఓ ఇంట్లో విద్యుత్ సరఫరా లేదని మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. 11 కేవీ లైన్ ఒకటి ఆపి... మరొకటి ఆపకుండా విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేశాడు. ఆ సమయంలో విద్యుదాఘాతం జరిగి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నప్పకు ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :