ETV Bharat / state

ఓబుళాపురంలో ఇనుప ఖనిజ లీజుకు అనుమతులు - Obulapuram iron lease

ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని ఓబుళాపురం ప్రాంతంలో ఓ ఇనుప ఖనిజ లీజుకు గనుల శాఖ అధికారులు పర్మిట్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి పర్మిట్లు జారీ చేయడం లేదు. అయితే శ్రీ సాయి బాలాజీ మినరల్స్‌కు మాత్రం రెండు వారాల కిందట పర్మిట్ల జారీ మొదలైంది.

Permits for lease of iron ore in Obulapuram
ఓబుళాపురంలో ఇనుప ఖనిజ లీజుకు అనుమతులు
author img

By

Published : Aug 19, 2020, 8:28 AM IST

ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని వివాదాస్పద ఓబుళాపురం ప్రాంతంలో ఓ ఇనుప ఖనిజ లీజుకు గనుల శాఖ అధికారులు పర్మిట్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్‌ మండలం ఓబుళాపురం పరిధిలో పట్టా భూమిలోని సర్వే నంబరు 370, 58/పిలో శ్రీ సాయి బాలాజీ మినరల్స్‌కు 2007లో 4.06 హెక్టార్లలో ఇనుప ఖనిజ లీజు మంజూరైంది. 2009-10లో ఓబుళాపురం ప్రాంతంలోని ఇనుప ఖనిజ గనుల్లో అక్రమాలు జరిగాయని, సరిహద్దులు దాటి విలువైన ఖనిజాన్ని తవ్వి తరలించారనేది వెలుగులోకి రావడంతో సీబీఐ కేసులు నమోదు చేసింది. ఓఎంసీ, ఏఎంసీ తదితర ఆరు లీజులను గనుల శాఖ సస్పెండ్‌ చేసింది. ఆ ప్రాంతంలో ఉన్న ఇతర లీజులకు కూడా అధికారులు అప్పటి నుంచి పర్మిట్లు జారీ చేయడం లేదు. అయితే శ్రీ సాయి బాలాజీ మినరల్స్‌కు మాత్రం రెండు వారాల కిందట పర్మిట్ల జారీ మొదలైంది.

ప్రస్తుతం పర్మిట్లు ఇచ్చిన లీజులో అతి తక్కువ గ్రేడ్‌ ఖనిజం ఉంది. అయితే దీనికి దగ్గరలోనే సీబీఐ సీజ్‌ చేసిన అధిక విలువైన హై గ్రేడ్‌ ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. మరోవైపు ఈ లీజుదారుడు కొంతకాలంగా పర్మిట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల కిందట ఇదే లీజుదారుడు తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, పర్మిట్లు ఇవ్వాలంటూ ఆన్‌లైన్‌లో ఆటో పర్మిట్లకు దరఖాస్తు చేశారు. పర్మిట్ల జారీ కూడా ఆరంభించారు. అధికారులకు అనుమానం వచ్చి అప్‌లోడ్‌ చేసిన అనుమతుల వివరాలు పరిశీలిస్తే తేడా ఉన్నట్లు గుర్తించారు. దీంతో పర్మిట్ల జారీ బ్లాక్‌ చేశారు. తాజాగా రెండు వారాల కిందట మళ్లీ పర్మిట్ల జారీ మొదలైంది. సమీపంలోనే సీజ్‌ చేసిన ఇనుప ఖనిజం ఉండటంతో, ఈ లీజుకు పర్మిట్లు ఎలా ఇచ్చారనేది ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని గనుల శాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా.. లీజుదారుడు అన్ని అనుమతులు తెచ్చుకున్నారని, అందుకే పర్మిట్లు ఇస్తున్నామని, ఏదైనా తేడా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఇదీ చూడండి. కడప సెంట్రల్ జైలులో.. 317 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.