ETV Bharat / state

'ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి' - ananthapur district newsupdates

అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం, కొత్తచెరువు, కదిరి తదితర ప్రాంతాల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణం జరిగేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీఎస్పీ చెప్పారు.

People should exercise their right to vote freely and fearlessly in elections
'ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి'
author img

By

Published : Feb 9, 2021, 7:16 AM IST

పంచాయతీ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. పోలింగ్ విధుల్లో పాల్గొనే పోలీసు బలగాలకు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. బుక్కపట్నం, కొత్తచెరువు తదితర ప్రాంతాల్లో డీఎస్పీ, సీఐ, ఎస్ఐల ఆధ్వర్యంలో కవాతు నిర్వహించాయి.

ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు ఎన్నికల ప్రవర్తనా నియామవళి గురించి తెలియజేశారు. ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా భరోసా కల్పిస్తూ.. ఈ కవాతు సాగింది.

తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలీంగ్ ప్రక్రియలో గ్రామీణ ప్రాంతాలలో ప్రశాంత వాతావరణం మధ్య ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా నల్లచెరువు మండల పరిధిలో కవాతు నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. బందోబస్తును ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ చెప్పారు.

ఇదీ చదవండి: తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.