2018 డిసెంబర్ నెలలో బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి తెలుగుదేశం ప్రభుత్వం కుల సంఘాలకు వారికి రుణాలు మంజూరు చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం.
అనంతపురం జిల్లాలోని దోసలుడికి గ్రామానికి చెందిన శ్రీ సాయి కుమ్మరి సొసైటీకి రూ.30 లక్షలు మంజూరైంది. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతో ఆ సొమ్ము లబ్ధిదారుల ఖాతాలో పడలేదని బాధితులు వాపోతున్నారు. సొమ్ము కోసం రెండేళ్ల నుంచి తిరుగుతున్నారు. ఆ డబ్బు వస్తుందని దాదాపు రూ.4 లక్షలు ఖర్చు చేశారు. ఉపాధికి కావాల్సిన వస్తువులు సమకుర్చుకున్నారు.
చివరకు ఆ రుణం రాకపోయేసరికి అప్పులు పాలయ్యాయరు. అవి చెల్లించలేక కసాపురం గ్రామంలోని ఎస్బీఐ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.
బ్యాంకు అధికారులు తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులకు నచ్చజెప్పారు. నెల రోజుల్లో రుణం వచ్చేలా చేస్తామని బ్యాంకు అధికారులు హామీతో లబ్ధిదారులు శాంతించారు.
ఇదీ చదవండి:
చూడటానికి వెళ్లి చెక్డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి