ETV Bharat / state

రెడ్ జోన్ ప్రాంతవాసుల ఆందోళన - red zone people troubles

అనంతపురం జిల్లా మడకశిరలో ప్రజలు ఆందోళన చేపట్టారు. రెడ్​జోన్​ కారణంగా కుటుంబాలు పస్తులు ఉంటున్నాయని... సాయం చేసేందుకు ఎవరూ రావడం లేదని వాపోతున్నారు.

ananthapuram district
రెడ్ జోన్ ప్రాంతవాసుల ఆందోళన
author img

By

Published : Jun 8, 2020, 12:53 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో కరోన పాజిటివ్ కేసులు రావటంతో పట్టణంలోని ఆర్యపేట విధిని రెడ్ జోన్​గా ప్రకటించి ఆ ప్రాంతాన్ని అధికారులు కట్టడి చేశారు. దాదాపు 31 రోజులైన ఆ ప్రాంతంలో ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదు.

విసిగిపోయిన ఆ ప్రాంతవాసులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు పూట గడవడం కష్టంగా మారిందని వాపోయారు. బయటకు వెళ్ళలేక చేతిలో డబ్బులు లేక పస్తులు ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రాంతానికి మినహాయింపు ఇవ్వాలని పోలీసులకు విన్నవించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశపరిచి దీనిపై విచారణ చేస్తామన్న ఎస్ఐ హామీతో కాలనీవాసులు శాంతించి వెనుదిరిగారు.

ఇది చదవండి రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.