అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సీవీవీ నగర్లో లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 51 బస్తాలు, సాయిబాబు నగర్లో హనుమంతు అనే వ్యక్తి ఇంట్లో 17 బస్తాల ప్రభుత్వ చౌక బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు కలిపి 68 బస్తాల చౌక బియ్యాన్ని వారి ఇళ్లల్లో ఉంచుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్సై ధరణి బాబు తెలిపారు. బియ్యం బస్తాలు స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నట్లు ఉరవకొండ ఎమ్మార్వో వాణిశ్రీ తెలిపారు.
ఇదీ చదవండి : మద్యం విక్రయిస్తున్న ఇద్దరు యువకులు అరెస్ట్