అనంతపురం జిల్లా నార్పలలోని శ్రీనివాస డీలక్స్ థియేటర్లో ఉద్రిక్తత నెలకొంది. వకీల్ సాబ్ సినిమా సెకండ్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొంతమంది కానిస్టేబుల్ గౌస్‌పై కత్తితో దాడి చేశారు. గాయపడిన కానిస్టేబుల్ని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించామని సీఐ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు.
ఇవీ చదవండి