మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్వగ్రామమైన అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో.. నూతనంగా నిర్మించిన ఆలయాలను మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు శ్రీరామ్ సందర్శించారు. వీరికి రఘురావీరారెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ పరిసరాల్లో కలియతిరుగుతూ అక్కడి విశిష్టతలు వివరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పడింతులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.
రెండు నెలల కిందటే ఆలయాలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రారంభ కార్యక్రమాలకు ప్రముఖులను ఆహ్వానించినా.. కరోనా కారణంగా హాజరు కాలేకపోయారు. ఇవాళ పరిటాల సునీత, శ్రీరామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారిని రఘువీరా సత్కరించారు.
ఇదీ చదవండి:
Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి