ETV Bharat / state

పరిటాల రవికి కుటుంబీకులు, అభిమానులు నివాళి - పరిటాల సునీత తనయుడు శ్రీరాం వ్యాఖ్యలు

పరిటాల రవి చనిపోయి ఇన్నేళ్లయినా.. అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఎప్పటికీ మరవలేమన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. పరిటాల రవి 15వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా వెంకటాపురానికి వేలాది మంది అభిమానులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం అభిమానుల కోసం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

paritala ravi 15th death anniversary
పరిటాల రవి 15వ వర్ధంతి
author img

By

Published : Jan 24, 2020, 12:26 PM IST

Updated : Jan 24, 2020, 6:06 PM IST

పరిటాల రవి చనిపోయి 15 ఏళ్లు గడిచినా ఇంకా ఆయన అభిమానుల గుండెల్లో నిలిచే ఉన్నారని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం జిల్లాలోని రవి స్వగ్రామం వెంకటాపురంలో వేలాది మంది అభిమానులు ఆయనకు నివాళులర్పించారు. పరిటాల సునీతతో పాటు, తనయుడు శ్రీరాం ఇతర కుటుంబ సభ్యులు ఘాట్ వద్ద పూజలు చేసి నివాళులు అర్పించారు. అభిమానులు, కార్యకర్తల కోసం అన్నదానం చేపట్టారు. రవి చనిపోయిన నాటి నుంచి ఆయన ఆశయ సాధన కోసమే పని చేస్తున్నామని పరిటాల సునీత తెలిపారు. రానున్న రోజుల్లో రాప్తాడు, ధర్మవరంతోపాటు అన్ని ప్రాంతాలను సమానంగా చూసుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

పరిటాల రవికి నివాళులర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు

కళ్యాణదుర్గం తెదేపా కార్యాలయంలో పరిటాల రవి 15వ వర్ధంతిని నిర్వహించారు. నియోజకవర్గ ఇం​ఛార్జీ​ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సీనియర్ తెదేపా నాయకుడు మారేపల్లి మల్లికార్జున పరిటాల రవి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. పరిటాల రవి అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోపరిటాల రవి 15వ వర్ధంతి

ఇవీ చూడండి:

ధర్మవరంలో బుద్ధుని విగ్రహం ఆవిష్కరణ

sample description
Last Updated : Jan 24, 2020, 6:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.