మారాం చేశారని అడిగినంత సొమ్ము ఇవ్వటం, వాహనాలు నడుపుతున్నా ప్రోత్సహించటం.. ఇలా పిల్లలు అడగటమే ఆలస్యం.. ఏ మాత్రం ఆలోచించకుండా ఇస్తారు. వీటి కారణంగా చిన్నతనంలో వ్యవసనాలకు బానిసలవ్వటం, ప్రమాదాల బారిన పడటం జరుగుతోంది.
తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ సమీపంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై ఓ కారులో కుటుంబ సభ్యులు వెళ్తుండగా ఇద్దరు పిల్లలు కారు వెనకాల ఉన్న డిక్కీలో కూర్చొని మొబైల్ ఫోన్లో గేములు ఆడుతూ కనిపించారు. ఆ వాహనం వెనుక వస్తున్న ఓ చోదకుడు ఈ దృశ్యాలను తన చరవాణిలో బంధించాడు. వీడియో తీసినంత సేపు ఏం అవుతుందిలే అన్నట్టు ఉన్నారా చిన్నారులు. చిన్న పొరపాటు జరిగినా ఇద్దరి ప్రాణాలకు ముప్పు అని తెలిసి కూడా వారి తల్లిదండ్రులు అలా చేయటాన్ని పలువురు విమర్మిస్తున్నారు.
ఇదీ చదవండీ.. ATM FRAUDS: డబ్బు డ్రా చేసినా.. ఖాతాలో సొమ్ము భద్రం