అనంతపురం జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులకు జలకళ వచ్చింది. సోమందేపల్లి మండలంలో కురిసిన 35.2 మిల్లీ మీటర్ల వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలోకి పాపిరెడ్డి పల్లి చెరువు పూర్తిగా నిండిపోయి పొంగుతోంది. చాలా సంవత్సరాల తర్వాత చెరువు నిండిపోవటంతో యువకులు పెద్ద సంఖ్యలో ఈత కొడుతూ, స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. భారీగా చేరిన వరద నీటిని చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న భారీ వరదలు