ధర్మవరంలో ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి - ధర్మవరంలో ఘంటసాల వర్ధంతి
అనంతపురం జిల్లా ధర్మవరంలోని కళాజ్యోతి ఆడిటోరియంలో ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతిని నిర్వహించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎల్.వి గంగాధర్ శాస్త్రి సంగీత విభావరిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్డీఓ మధుసూదన్ హజరయ్యారు. సినీ సంగీత పరిశ్రమకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడిగా ఘంటసాల చేసిన సేవలు మరువలేనివన్నారు. గాయకుడు గంగాధర శాస్త్రి ఘంటసాల పాటలు ఆలపించారు.