అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎనుములదొడ్డిలో 25 ఏళ్లపాటు మల్లనగౌడ్ పాలన సాగింది. ఆయన కుటుంబీకులే 40 ఏళ్లపాటు సర్పంచులుగా వ్యవహరించారు. 1956 నుంచి 1996 వరకు మల్లనగౌడ్, ఆయన తమ్ముడు మల్లికార్జునగౌడ్, కుమారుడు శేఖరగౌడ్ సర్పంచులుగా కొనసాగారు. తండ్రి 25 ఏళ్లు, ఆయన తమ్ముడు అయిదేళ్లు, కుమారుడు పదేళ్లు పదవిలో కొనసాగారు. మూడు దఫాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించారు. మల్లనగౌడ్ మృతి తర్వాత ఆయన కుమారులు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.
గుర్తుండిపోయేలా..
1971లోనే గ్రామానికి విద్యుత్తు సౌకర్యం కల్పించి వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చేందుకు కృషి చేసి 14 ఎకరాల భూమిని సేకరించారు. దాదాపు 3 వేల ఎకరాల ప్రభుత్వ భూములను రైతులకు పట్టాలు మంజూరు చేయించారు. తాగునీటి ట్యాంకులు, సిమెంటు రహదారులు నిర్మించారు. గ్రామంలో పంచాయతీ భవనంతోపాటు ఆదాయాన్ని సమకూర్చేందుకు వాణిజ్య సముదాయాన్ని నిర్మించారు. దోబీఘాట్ ఏర్పాటు చేశారు. మల్లనగౌడ్ అయిదేళ్లపాటు సమితి అధ్యక్షుడిగా కొనసాగారు. అదే సమయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టును కంబదూరులో ఏర్పాటు చేయించారు. కళ్యాణదుర్గం మార్కెట్‌యార్డుకు తొలి ఛైర్మన్‌గా కొనసాగారు. ఈయన పెద్ద కోడలు సులోచన తొలి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.
మల్లనగౌడ్ (పాతచిత్రం)
ఇవీ చూడండి...