అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,200 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. కర్ణాటక సరిహద్దులోని బొమ్మనహాల్, రాప్తాడు, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మండలాల్లో పంట ఎక్కువగా సాగయ్యింది. దిగుబడి బాగా వచ్చినా.. లాక్డౌన్ వల్ల ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. వినియోగదారులకు విక్రయించే ధర కిలో 25 నుంచి 30 రూపాయలు ఉండగా.. తమ నుంచి 8 రూపాయలకు కూడా కొనడం లేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. పంటను అమ్ముకునే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేస్తే మేలే
వినియోగదారుల నుంచి ఉల్లికి పెద్దఎత్తున డిమాండ్ ఉంది. లాక్డౌన్ సందర్భంగా అధికారులు పలుచోట్ల ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లలో ఉల్లిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకొని జిల్లాలోని ఉల్లినంతా ప్రధాన పట్టణాలకు తీసుకొచ్చేలా అవకాశం కల్పిస్తే రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది.
ఇదీ చూడండి..