అనంతపురం జిల్లా ధర్మవరంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మరణించాడు. మృతదేహం తలభాగం మొండెం నుంచి విడిపోయింది. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. జిఆర్పి ఎస్ఐ నాగప్ప రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ధర్మవరం బాలాజీ నగర్ కు చెందిన హరి ప్రసాద్ పెనుకొండ వద్ద ఉన్న పరిశ్రమలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్యూటీకి వెళ్లి వస్తూ... రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ఉండవచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని హరిప్రసాద్ శవాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండీ...ప్రాణం తీసిన ఇసుక అక్రమ రవాణా..