ETV Bharat / state

రోడ్డే ఆవాసం.. ఆకలితో సావాసం - అనంతపురం బళ్లారి వార్తలు

అందరూ ఉన్నా ఎవ్వరు లేని అనాథలా జీవిస్తోంది ఈ వృద్ధురాలు. తనను చూసుకోవటం భారంగా ఉందని కన్నకొడుకే రోడ్డుపై పడేసిన అంజలిని ఆదుకునేదెవరు..? తన ఆకలిని తీర్చేదెవరు..?

old women living on road side in ananthapur district
అనంతపురంలో రోడ్డుపై నివసిస్తున్న వృద్దురాలు అంజలి
author img

By

Published : Jun 3, 2020, 9:05 AM IST

అనంతపురం జిల్లాలోని బళ్లారి బైపాస్‌ రోడ్డు డివైడర్‌పై చిన్న తడికెల నీడలో జీవనం సాగిస్తోంది ఈ వృద్ధురాలు. ఎండొచ్చినా.. వానొచ్చినా అక్కడే గత నెల రోజులుగా ఉంటోంది. ఎవరైనే దాతలు పెడితే నాలుగు మెతుకులు తింటోంది. లేదంటే ఆకలి కడుపుతో... అలాగే నిద్రలోకి జారుకుంటోంది. నిద్రలో రహదారి మీదకు జారిపడినా.. వాహనాలు అదుపు తప్పి దూసుకొచ్చినా ప్రాణానికే ప్రమాదం. తన పేరు అంజలీ అని.. ముగ్గురు పిల్లలని వృద్ధురాలు తెలిపింది. తన కుమారుడే ఇక్కడ వదిలి వెళ్లాడనీ.. వెళ్తూవెళ్తూ తనకు నీడ కోసం తడికెను ఏర్పాటు చేశాడని ఆ వృద్ధురాలు చెప్పింది. తనను బయట పడేసినా.. కన్న ప్రేమతో వారిని నలుగురిలో నవ్వులపాలు చేయకూడదనే ఉద్దేశంతో బాధను కడుపునే పెట్టుకొంది.

ఇదీ చదవండి:

ఈ తల్లి 14 ఏళ్లుగా కొడుకును మోస్తూనే ఉంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.